Latest Blog

ఊరు వోతుంది, గంగమ్మకి తొవ్వ ఇస్తుంది

ఊరు వోతుంది, గంగమ్మకి తొవ్వ ఇస్తుంది.

Indie Birds

Telangana Village – Maamidyala

ఊరు వోతుంది, గంగమ్మని ఊల్లెకి పిలిచి ఊరువోతుంది…
మీ గొంతు తడుపుతాతొవ్వ ఇయ్యుండ్రీ, అని గంగమ్మ ఊర్ని అడిగింది…
ఊరు మారుమాట్లాడకుండా కన్లల్ల నీళ్లు సంతోషంగా తూడుస్కుంట ఊరు వోతుంది.

సిద్దిపేట జిల్లాల సుమారు 1500 వందల జనాబా ఉన్న మామిడ్యాల అనే ఊరు రిసర్వాయర్ కోసం ఊర్ని త్యాగం జేసింది.
“తాతల కాంచి ఉన్న యాద్గార్లు కడిగేశ్నా మయే, లీల్లు ఒస్తే సాలు, తరాలు బాగ్వడ్తయ్” అని కచ్చితమై ఊర్ని నీళ్ళకొరకు ఇడిసి కాలి జేస్తున్నరు. ఇంక నాలుగైదు నెలలే ఊళ్లె ఉంటమన్న ఆలోచనకే కష్టమైతాన్నా గూడా మంచి ముచ్చట కే గదా అన్కొని, ఉన్న దినాలు ఊర్ని ప్రేమగ జూసుకుంట ఉన్నరు.

మల్ల గీ ఊరు కన్లకి కానరాదు గావట్టి ఈ నాలుగు ఊర్ల జనాలకి ఒక మంచి సినిమా తీసి తోఫా ఇద్దాం అనుకుంటున్నం.

అంతకు ముందుగాల్నే ఊరు అందం జూసి “టప్ప టప్ప” ఫోట్వలు గోట్టుకున్నం. “అరే గింత మంచి ఊరేంది రబై” అని. ఆ గంగమ్మ దయనో ఏందో గీ ఆలోచన ఒచ్చింది “తీస్తే గీస్తే గీ ఊర్లనే షూటింగ్ జెయ్యాలని”.
ఆ స్పూరిని, అందాన్ని, ఆఖిర్ సారి ఊరు వడే ఖుషి ని మా కెమ్రాలల్ల దాపెట్టి ముందు తరాలకి ఆ యాదిలని సూపెట్టాలని  కోరుకుంటాంన్నం. ఐతే మా గీ సినిమా కథ గెట్లుంటదో తెల్వనీకె ఒక చిన్న ట్రైలర్ గూడ చేసినం. మరి గీ ట్రైలర్ చూపిస్తే సపోర్ట్ చేస్తరు గదా !


%d bloggers like this: