Latest Blog

మీకెందుకు డబ్బులివ్వాలి ?

“YouTube లో views రావు, తీసిన సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో తెలియదు ఒకవేళ రిలీజ్ అయినా వాటికి డబ్బులొస్తాయో లేదో gaurantee లేదు, అలాంటప్పుడు మీకెందుకు దబ్బులివ్వాలి “ ఒక ఫ్రెండ్ నన్ను అడిగాడు, చాలా మందికి ఉంది ఇలాంటి ప్రశ్నే. కానీ మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు, వాళ్ళ సహకారంతో గత ఐదేళ్లలో కనీసం పన్నెండు ప్రాజెక్టులు చేశాం, దాదాపుగా 1500 నిమిషాల content create చేశాం, అంటే 25 గంటలు, పన్నెండు చిన్న సినిమాల లెంగ్త్, మేము పెట్టిన ఖర్చు కోటి రూపాయలు, మూడు ప్రాజెక్టులు మాత్రం నిర్మాతలతో చేసినవి మిగతావి అన్ని crowd funding ద్వారా చేసినవే.

కొన్ని బయటపెట్టాం కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. కేవలం కథపరమైన content మాత్రమే కాదు, 35+ soundtracks బయటకొచ్చాయి, 150+ actors మాతో పని చేశారు, కొంతమంది ఫ్రెండ్స్ అయితే, ఎక్కువ శాతం యాక్టింగ్ ప్రొఫెషన్ గా తీసుకున్నవాళ్ళే, అందులో చాలా మంది కొత్త  వాళ్ళు. మా ఫిక్షన్ చూసి యాక్టర్స్ కి రెగ్యులర్ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. మేము చేసిన దాంట్లో అతి పెద్ద అచీవ్మెంట్ sync sound, దీని గురించి చాలా సార్లు రాశాను. ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నది crowd funding గురించి. మేము చేస్తున్నది కొత్త రకమైన ఫిక్షన్, ఇది అందరికీ ‘ఎక్కదు’, కంప్లయింట్ ఏమీ లేదు, అందరికీ అన్నీ నచ్చితే సినిమాల కన్నా లాభమొచ్చే బిజినెస్ ఉండదు.

Film Montage Song

Film Montage Song

సినిమా విషయంలో మన ప్రేక్షకులు ఒకరకమైన సినిమాకే అలావాటుపడిపోయారు, రంగు రంగుల లొకేషన్స్, సెట్స్, ముద్ద ముద్దగా మేకప్పులు, ఇస్త్రీ నలగని కొత్త బట్టలు, తెల్లగా వుంటేనే హీరో హీరోయిన్లు , ఇలా చాలా రకాలుగా conditioned అయిపోయారు. మా వాటిలో ఇవేవీ ఉండవు, అలాగని మేమేమీ ‘ఆర్ట్ cinema’’ చేయడం లేదు, జీవితానికి అతి దగ్గరగా ఉండే ఫిక్షన్ మాది. కొంతమంది చూడటం మొదలుపెట్టి మా వల్ల కాదు ఈ రియాలిటీ, ఆపేసాం అని నాకు చెప్పారు. ఈ realistic fiction ప్రేక్షకులకు మాత్రమే కాదు నిర్మాతలకు ఎక్కదు,మాకు నిర్మాతలు దొరకరు, అందుకే మేము జనాల్ని నమ్ముకుంటాం, ఊహించనంత సపోర్ట్ దొరికింది ఇప్పటివరకు, కానీ సరిపోవటం లేదు. మరింతమంది కొత్తవాళ్ళని రీచ్ అయ్యే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాం. ఈ ప్రయత్నానికి మీ అందరి మద్దతు కావాలి, చేయగలిగితే ఆర్థిక సహాయం, లేదా మీకు తెల్సినవాళ్ళకి షేర్ చేయటం, ఒకవేళ మీరు మొహమాటపెట్టి వేయించగలిగితే మా campaign  లో ఫ్రెండ్స్ చేత డబ్బులు వేయించడం ఇలా మీ అందరూ తలో ఫింగర్ వేసి మొబైల్ తీసి మాకు సపోర్ట్ చేయండి. మేమెప్పుడూ కొత్తగానే ప్రయత్నిస్తాం.

Film Montage Song

Film Montage Song

%d bloggers like this: