సమూహ నిధులు – Crowdfunding by Camp Sasi
“శశి & batch crowdfunding పేరుతో జనాల దగ్గర డబ్బులు తీసుకుని ఎగరేస్తారు” అని ఒక తప్పుడు అభిప్రాయం ఉంది కొందరిలో. First thing ఇప్పటివరకు మేము చేసిన crowdfunding campaigns అన్నీ ప్లాప్. మేము అడిగినంత కాదు కదా కనీసం దరిదాపుల్లోకి కూడా మాకు డబ్బులు రాలేదు. మరి ఎలా తీస్తున్నాం ? మా campaign చూసి మా మీద అభిమానంతో మేమేదో కొత్తగా ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఎంకరేజ్ చేద్దాం అని personal గా ఇచ్చిన డబ్బులతో షూటింగ్స్ వరకు ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర లేట్ అవుతున్నాం. గత ఆరేళ్లలో మేము 12 ప్రాజెక్టులు చేసాం, ఆగిపోయినవి కాకుండా, నాలుగు బయటకు వచ్చాయి, మిగతావి పోస్టులో ఉన్నాయి. అవి కూడా పూర్తవుతాయి, కానీ కొంచెం టైం పడుతుంది. ఎందుకిన్ని ప్రాజెక్టులు ఒకటే చేయొచ్చు కదా అంటే, మా cinema excitement అలాంటిది, ఏదన్నా ఐడియా అనుకోగానే అది స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూడాలని ఆతృత. పదివేలు ఉంటె షూటింగ్ మొదలుపెట్టేసి అప్పుడు అడుక్కుంటుంటాం. మేము తిన్నా తాగినా తిరిగినా ఆ డబ్బులతోనే, మాకింకేం వేరే ఆదాయ మార్గాలు లేవు. సినిమాలు చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నాం. మేము కనీసం బట్టలు చెప్పులు కూడా కొనుక్కుమ్, ఇంట్లోవాళ్ళు లేదా మిత్రులు ఎవరైనా కొనిస్తారు.