Month: March 2018
‘NO CINEMA’ వీకెండ్ 28 ఏళ్ళ కళ్యాణ్ టైం చూసాడు, 9:38, ఇంకో గంటన్నర ఉంది వైన్ షాప్ మూయటానికి. ముగ్గురు రూమ్మేట్స్ లాంగ్వీకెండ్ అని ఊర్లకి వెళ్లిపోయారు. లేకపోతే శుక్రవారం ఈపాటికి రూంలో కోడికూర వండుతూ మందు పార్టీ మొదలైపోయేది. ప్రతివారం పార్టీనే. మందు తెచ్చుకోవడానికి బయలుదేరాడు, నిజాంపేట్ విలేజ్ ప్రశాంతంగా ఉంది. ఏ లాంగ్వీకెండ్ కి కళ్యాణ్ సొంతూరు విజయవాడ వెళ్ళడు, ఖాళీ హైదరాబాద్ రోడ్ల మీద బుల్లెట్