Boom boom Boom – I want you in my room Part 1
హంపి – ఎప్పుడు వెళ్లినా మత్తులోనే , 1st టైం మంది తో మాములుగా వెళ్ళాం.
Guts – ఎటర్నల్ అనుకుంట ఆఫ్టర్ a జాయింట్ కారు 120 దాటింది ఎటర్నల్ డైమెన్షన్స్ లో శశాంక్ వీడియో తీస్తుంటే నేను శశి ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ ఒక్కసారిగా రెండు అడుగులు ఎగిరి కార్ గ్యాస్ లీక్ ఐ వడగాల్పో , Ac లీకేజీ ఓ తెలియని కన్ఫ్యూషన్ లో ఆ అండర్ కన్స్ట్రక్షన్ రోడ్ పాస్ అవుతూ ఒక రైల్వే బ్రిడ్జి చూసి ఇక్కడ పాసింగ్ షాట్ ఒకటి తీద్దాం అని శశి అనటం తో సుమారు 15 నిమిషాల బ్రేక్ తరువాత స్టార్ట్ ఇంది మా ఈ montage song .


A Still From Montage Song.
కథ, కమామిషులు , మేకింగ్ , దారిద్యం లో దరికి చేరే కస్టాలు పక్కన పెడితే హంపి లో విరుపాపుర గడ్డి ఒక డిస్నీ ల్యాండ్ ఫర్ ఏనీ ఫిలిం మేకర్.
సుమారు ఆరు గంటల్లో వెళ్లే జర్నీ ఎండలో , AC లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఆగి షూట్ చేస్తూ చివరికి గడ్డి గాలి తగలగానే జర్నీ అలసట మర్చిపోయి అందరం శేష్ భేష్ లోకి 11 గంటల తరువాత ఎంటర్ ఐయ్యామ్.
ఆదిత్య 369 స్పేస్ షిప్ లోనుంచి శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానానికి వచ్చినట్టుంది వర్మ పరిస్థితి.
శ్రీకాంత్., ఎన్నో పనికి మాలిన సంవత్సరాల సహవాసం.
నాకు ఉన్న సో కాల్డ్ ఇంటర్నేషనల్ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ అనబడే వాళ్ళ పరిచయాలలో అందరికంటే నాకు నచ్చిన ఏకైక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్.
గడ్డి లో బండ రాళ్ళతో , బంగారు బామలతో సంసారం చేస్తూ కనీసం పడుకోవటానికి ప్లేస్ కూడా లేకున్నా రోజుకి ఒక భామతో సీక్రెట్ బీచ్ లో పరవశిస్తూ అందరిని ఆనంద పరుస్తూ తాగి పడిపోవటమో లేదా అరుదయిన రాళ్లు సంపాదించి వాటి పైన మైక్రో ఆర్ట్ చేయటమో శ్రీకాంత్ డైలీ పని.


Bike Ride – Film Montage Song
రాత్రి ఒంటి గంటకు కొబ్బరి చెట్ల మధ్య bamboo cottage ముందు ఇంకా పండని జామ చెట్టు పక్కన శ్రీకాంత్ నేను మాట్లాడుతుంటే ఆ కొబ్బరి చెట్ల మధ్య కట్టేసిన హమ్మోక్ లో పడుకొని కొబ్బరి ఆకుల మధ్యలోనుంచి చూస్తున్న చంద్రునితో మాట్లాడుతున్నాడు వర్మ. ఇంతలో పక్క cottage లో ప్యాక్ అప్ చెప్పి పెగ్గుతో వచ్చి మాతో జాయిన్ ఐ మాకు తెలీకుండా ఇంకో 10 నిమిషాలు షూట్ చేసి ఆ చల్లటి గాలి మత్తులో పడుకున్నాడు శశి.
ఇది గడ్డి లో మొదటిరాత్రి మత్తు కత.