Latest Blog

Mohan’s Cartoon Kaburlu

Cartoon Kaburlu

కార్టూన్ కబుర్లు in color

ఈ పుస్తకాన్ని సమీక్షించే అంత సీన్ లేదు నాకు, అసలు ఏ పుస్తకాన్ని కూడా. నచ్చితే పొగడటం లేకపోతే పక్కన పారేయడం.ఆల్రెడీ పొగిడేసాను కాబట్టి మళ్ళీ అదే పని చేయను.నేను చదివిన అతి తక్కువ పుస్తకాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పుస్తకం,కాస్త gap వచ్చి  మన రొటీన్ జీవితం బోర్ కొడుతోంది అనిపించినపుడు మళ్లీ చదువుకోవచ్చు.కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే మనకి కూడా కాస్త “జ్ఞానం” పెరిగి ఉంటుంది కాబట్టి. ఇలా ఈ బుక్ ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు.

త్వరలో “series of books” గా రాబోతోంది అదీ కలర్లో…బాగా నచ్చిన సినిమా “sequel” కోసం ఎదురు చూస్తున్నట్టుంది నాకు.ఇది చదవని వాళ్లకి పరిచయం చేయడం కోసమే ఈ స్టొరీ, Intro & ending మాత్రమే నేను రాస్తున్నది,మధ్యలో అంతా పుస్తకం నుండి కొన్ని “pieces” ఓపిక గా టైపు చేస్తున్నా మీరు కూడా ఓపిక గా చదవండి…“చదవటం మంచిదే”…ఇది చదివిన ఐదు నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది…

Indie Birds

Mohan – Art

వేపకాయంత ఉందా రండి కార్టూనిస్ట్ కండి

రెండో అర్హత : టెన్త్ పోయిందనో,ఇంటర్ పాసయ్యారనో  బెంగ పడనవసరం లేదు. డిగ్రీ అయిందీ… ఎద్దులాగా ఇరవయ్యేళ్ళు కింద కోచ్చయనే బాధవద్దు. ఇప్పుడైనా మీరు బొమ్మలు మొదలెట్టొచ్చు. కావలసిన పరికరములు : ఒక పెన్సిలూ, ఒక కాగితం, బుర్రా!బస్ అంతే. పెన్సిలూ కాయితం దగ్గర్లోని ఫాన్సీ షాపులో దొరుకుతాయి. బుర్ర అమ్మరు. ఉంటే అది మీ దగ్గరే ఉంటుంది. ( ఉండకపోతే ఉండదేమో) ఉన్న బుర్రను అలానే జేబులో ఉంచుకోవాలనేం లేదు. పైకి తీయొచ్చు. పెంచుకోవచ్చు. పదును పెట్టొచ్చు. అదెలా అంటే సింపుల్.

వాల్ట్ డిస్నీ చిక్కడపల్లి రాలేదుగా

అలాంటి తరుణంలో ఓసారి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి నా మొదటి కేసెట్ చూపించా. [sociallocker] [/sociallocker]కొద్ది సెకన్ల బిట్టునే నాలుగైదు సార్లు తిప్పి తిప్పి చూశాడు. ‘మనీ’ లో టైటిల్ సాంగ్ వచ్చేటపుడు యానిమేషన్ చేయాలన్నాడు. ఎగిరిగంతేశాను. “డబ్బులు మనుషులు” అంతే సబ్జెక్టు. సినిమా కథతో ఎలాంటి సంబంధం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేయండన్నాడు. మరీ బావుంది. రెండు రోజుల్లో పాతిక ఐడియాలని స్టొరీ బోర్డులుగా చేశా. అప్పుడాయన మనీ లేకనో ఏమో మనీ సినిమా సగంలో ఆపి ఎవరికో ‘గాయం’ చేసి పెడుతున్నాడు. …….. ….. ……

Indie Birds

Mohan – Cartoonist.

జగపతి బాబూ,ఊర్మిళ డైలాగులు ఎంతకీ తరగవు. మొత్తం మీద యూనిట్లో అందరూ స్టొరీ బోర్డులని తిరగేయటం అయింది.

చిత్తప్రసాద్ కోసం

టాగూర్ కూచుని ఉన్నాడు. తెల్ల జుత్తుతో,తెల్ల గడ్డంతో,తెల్ల కాగితంలాగా రుషిలా కూచుని ఉన్నాడు. ఆ రుషి బొమ్మ గీయాలి.అదే ఇంటర్వ్యూ. అదే పరీక్ష. స్కెచ్ మొదలైంది. పొడుగాటి ముక్కు, విశాల పాలభాగం, అలలు అలలుగా గడ్డం. జుట్టు. బొత్తిగా భయం బెరుకూ లేకుండా గొప్ప వేగం విశ్వాసంతో చిత్త ప్రసాద్ చేతులు కదిలాయి. పోర్ ట్రైట్ పూర్తయింది. గీతాంజలి రాయడమే కాదు,గీతాలు గీయడం లో కూడా చేయి తిరిగిన టాగూర్ విస్తుపోయాడు. ఈ కుర్రవాడికి కళాభవన్ లో అడ్మిషన్ ఇవ్వడమా?! కాలేజీలో బొమ్మలు నేర్చుకోవడానికి కాలం వృధా చేయొద్దని సలహా ఇచ్చారు టాగూర్. అది గుర్తింపు. అది విజయం. కల్తీలేని విజయం. చిత్త ప్రసాద్ మరి వెనుదిరిగి చూడలేదు. నేరుగా కలకత్తాలోకి దూకాడు.

అబూ శిఖరం అంచుల్లో

“ఐ లైక్ యువర్ ఎన్.టి.ఆర్ లావుగా, బుజ్జిగా ఉండే సన్యాసిని గీస్తావు. నీ వర్క్ బావుంటుంది” అన్నాడాయన. కానీ ప్రతి రోజూ అలా రియలిస్టిక్ గా కార్టూన్లు గీయడం చాలా విసుగానిపిస్తుందని చెప్పా. ఏనాడో రెండో ప్రపంచయుద్ధ కాలంలో డేవిడ్ లో గీసినట్టూ, ఆయన లాగా నేటికీ గీసే వాళ్ళని చూసి మళ్ళీ అలాగే  గీయటం చాలా సికెనింగ్ గా ఉందనీ చెప్పాను. “కానీ నీ బొమ్మల్లో క్రాస్ హేచింగ్ పాత వాసనలేమీ ఉండవు. నీ గీత ఫలానా పెద్ద ఆర్టిస్టు ( ఆ పెద్ద ఆర్టిస్టు పేరు చెప్పాలంటే నాకు సిగ్గు బాబూ) కంటే బావుంటుంది” అన్నాడాయన. ( అమాంతంగా మూడురెట్లు లావయ్యాను )

Indie Birds

The back cover of Cartoon Kaburlu

ఎన్టీఆర్ తో ఎన్ కౌంటర్

డిజైన్ పూర్తి చేసి మధ్యాన్నం మళ్ళీ ఆయనింటికి వెళ్ళా. ఆయన సెక్రటేరియట్ లో ఉన్నారు. ఫోన్ చేస్తే నన్ను ఇంట్లోనే ఉండమని వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాననీ చెప్పారు. ఏం చీఫ్ మినిస్టరో ఏమో! సెక్రటేరియట్ లో సవాలక్ష పనులు గదా! పైగా ఎన్నికల ఫలితాలు తెరలు తెరలుగా వస్తున్నాయి. ఎన్టీఆర్ పేరిట నిలబడ్డ కాకులు గూడా కావుకావు మంటూ ఎంపీ లు గా గెలిచిపోతున్నారు. ఆర్నెల్ల క్రితం ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన ఎన్టీఆర్ ని భారతదేశ మంతా మరోసారి నివ్వెరపోయి చూస్తోంది. ఆయన పెద్ద అంగల్లో చలాకీగా మెట్లెక్కి వచ్చాడు. ఉక్కిరి బిక్కిరియెంత విజయం. ఆయన జీవితంలోనే మళ్ళీ అలాటి దెప్పుడూ సాదించలేడేమోనన్నంత  కిక్కులో ఉండాలి గదా. ఎన్టీఆర్ ఆ క్షణంలో అస్సలు అలా లేనే లేడు. చాలా మెల్లిగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. నా దగ్గరకొస్తే లేచి నించున్నాను. నానడుం చుట్టూ చెయి వేసి, ఆయన గదిలోకి కాకుండా డైనింగ్ రూమ్ లోకి తీసుకెళ్ళాడు. ఉదయం లోపలి పేజీల్లో గూడా ఆరోజు కార్టూన్లన్నీ చూశానని చెప్పాడు. “నీకు మంచి రేఖ ఉంది. బాగా కృషి చెయ్యి. భగవంతుడు నీ వెంట ఉన్నాడు” అని చెప్పాడు.

Indie Birds

Man bites dog

ప్రస్తుతానికి ఓపిక అయిపోయింది, ఈ పుస్తకం లో నలభై ఏడు ఉన్నాయి. కాస్త తెలిసిన పేర్లు అయితే జనానికి ఇంట్రెస్ట్ ఉంటుందని ఇప్పటికి ఈ ఆర్టికల్స్ లోంచి కొన్ని టైప్ చేసాను. next టైం వేరేవి కూడా మీకు రుచి చూపించే ప్రయత్నం చేస్తాను.

%d bloggers like this: