Dhoolpet Ganesha – Documentary – Indie Film
ధూల్పేట్ గణేషా ( Documentary )
రెండు రోజుల క్రితమే చూసాను. ఇది నేనూ, అనంతా నిర్మించిన డాక్యుమెంటరీ , చాలా మంది మిత్రులు సాంకేతిక ఆర్ధిక సహాయం కూడా చేసారు . నేను నిర్మాతని కాబట్టి ఖచ్చితంగా పొగుడుకుంటాను. ప్రస్తుతం ఆ పని చేయబోవడం లేదు. ఇది 2013 ఆగస్టులో మొదలుపెట్టిన documentary, ఇప్పటికి పూర్తయింది. ఒకసారి ధూల్పేట్ వెళ్ళినపుడు ప్రతి సందులో వినాయకుడి విగ్రహాలు తయారవవడం చూసి stun అయిపోయాను , నాకు తెలియదు ఇక్కడ ఇంత భారీ ఎత్తున విగ్రహాలు తయారవుతాయని.
ధూల్పేట్ ఏ సందులోకి వెళ్లిన తయారవుతున్న తయారయిన విగ్రహాలే. అతి చిన్న విగ్రహం నుంచి భారీ విగ్రహాల దాకా. ఇంటికి వచ్చిన వెంటనే దీని మీద ఎవరైనా ఏమైనా తీసారా అని youtube లో చూసాను, మొబైల్ తో తీసిన రెండు మూడు pixelated చిన్న వీడియోస్ తప్ప ఎం లేవు, నేను చెపుతున్నది 2013 లో సంగతి , ఇప్పుడు చాలా videos ఉన్నాయి. Images లో చూసాను, ఏం దొరకలేదు, బహుశా నేను సరిగ్గా వెతకలేదేమో. చాలా surprising గా అనిపించింది. ఇంత “Visual” ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు ? తెలియదా? తెలిసినా అది వాళ్ళని excite చేయలేదా ? అదీ కాక అప్పటికి digital కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇద్దరు ముగ్గురు filmmakers ని తప్పితే హైదరాబాద్ సిటీయే తెలుగు filmmakers ని excite చేయలేదు అలాంటిది ధూల్పేట్ గురించి ఎందుకు ఆలోచిస్తారు ? ధూల్పేట్ ,ఓల్డ్ సిటీ, మలక్పేట్ , ఇలాంటి ప్రాంతాలన్నీ విలన్లు కమెడియన్లు మాత్రమే ఉండే స్థలం అని మన దర్శకుల గట్టి నమ్మకం. ఇలా వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే నాకేమొస్తుంది, నేనే ఎదో ఒకటి తీయాలి అని డిసైడ్ అయిపోయి , plan చేసేసాను, టైటిల్ “DHOOLPET GANESHA”. అప్పటికీ ఒక దరిద్రపు upcoming దర్శకుడు అన్నాడు “Documentary ఏంటి భయ్యా ఈ టైటిల్ తో violent love story తీయొచ్చుగా” అని. మీరు ఇంతకన్నా ఆలోచించలేరురా అని అనుకుని నా పని నేను మొదలుపెట్టేసా. నేను అనుకున్న concept నా ఒక్కడివల్ల అవదు, అనంత ని partner చేసుకున్న, ఇద్దరం డైరెక్ట్ చేయాలి.
idea ఏంటంటే, నేను సిటీ లో జరిగే గణేశ్ events ని కవర్ చేస్తాను, అనంత ఏదో ఒక విగ్రహం సెలెక్ట్ చేసుకుని దానితో పాటు వాళ్ళ లారీనో డీసీఎం నో ఎక్కేసి వెళ్ళిపోయి అక్కడేం జరుగుతుందో షూట్ చేయాలి, ఈ రెండూ intercut అవుతుంటాయి. నాకు కావాల్సిందల్లా కొంచెం డబ్బులు, రెండు మూడు కెమెరాలు,ఒక సౌండ్ రికార్డర్ అంతే. నవీన్ అనే ఫ్రెండ్ డబ్బులు, ఒక కెమెరా arrange చేసాడు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా తెల్సిన సౌండ్ ఇంజనీర్ యతిరాజ్ దగ్గర Zoom రికార్డర్, హైదరాబాద్ వీడియో ఇండస్ట్రీలో most famous and passionate cameraman పెద్దా దగ్గర gopro తీసుకున్నాం, ఇవి కూడా నవీన్ రికమెండేషన్ తో దొరికినవే . అనంత ఒక నల్ల వినాయకుడిని సెలెక్ట్ చేసుకుని నాకు చూపించాడు. Done , fix అయిపొయింది. మా అదృష్టం కొద్దీ ఆ విగ్రహం శంషాబాద్ పక్కన ఒక చిన్న ఊరికి వెళ్తోంది. అదే ఏ వైజాగ్ వెళ్లే విగ్రహమే అయుంటే బడ్జెట్ ఏంటి అనేది నాకున్న పెద్ద ప్రశ్న. ఎందుకంటే వైజాగ్ నుంచి, ఇంకా కొన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుక్కెళ్తున్న వాళ్ళని చూసాను నేను. బంగారు ఆభరణాలతో నిగ నిగలాడుతున్న నల్ల వినాయకుడి ఆటో ఎక్కేసి అనంత ఆ ఊరెళ్లి షూట్ మొదలుపెట్టాడు , నేను సిటీ లో షూట్ చేస్తున్న. విపరీతమైన వర్షాలు, డబ్బులు దొరికేవి కాదు , ఇలా చాలా చిరాకు సమస్యలు. పండగ అయిపొయింది, షూటింగ్ ఆగింది.
Dhoolpet Ganesha – Trailer
ఇద్దరి దగ్గర కలిపి 24 గంటల footage . ఎడిట్ చేయడానికి ట్రై చేశా నా వల్ల కాలేదు. Footage అనంత కి ఇచ్చేసి నువ్వే ఎమన్నా చెయ్, దీనికి నువ్వు డైరెక్టర్ నేను ప్రొడ్యూసర్ అని చెప్పా. తరువాత నా పనిలో నేను పడిపోయా. ఏవేవో తీసుకుంటూ వెళ్లిపోతున్నా, అనంత survival కోసం ముష్టి corporate films చేస్తూ, ధూల్పేట్ గణేషా edit చేస్తూ సంవత్సారానికి రెండు మూడు updates ఇచ్చేవాడు. నేను అయినప్పుడు చూద్దాం లే అనుకునేవాణ్ణి. ఇప్పటికి పూర్తయింది,అంతా అనంతా కష్టమే. 84 నిమిషాల డాక్యుమెంటరీని interesting గా చూపించడం అంటే మామూలు విషయం కాదు, first నాకు అనంతా duration చెప్పినపుడు భయపడ్డాను. అంతసేపు చూడగలనా అని ? చూసాక నాకైతే నచ్చింది,ఇంతకన్నా నేనేం చెప్పను, భక్తి రసాత్మక చిత్రం మాత్రం కాదు.