Female Travel Blogger in Film Montage Song
ఆర్నెల్ల క్రితం ఉద్యోగం మానేసి తనకు నచ్చిన తను afford చేయగలిగిన places కి ఒంటరిగా వెళ్తూ వాటి గురించి blog లో రాస్తూ, ఇప్పుడిప్పుడే ఆ wriitings ద్వారా డబ్బులు సంపాదిస్తున్న Female Travel Blogger character దివ్య ది.
ఇలాంటి అమ్మాయిల గురించి చాలా చదివాను చదువుతుంటాను, ఏం freedom, ఏం life అది? ఉద్యోగం చేయకుండా తమకు ఇష్టమైన travelling చేస్తూ దానిమీద డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ ఆ డబ్బులు travelling కే ఖర్చు పెట్టుకుంటూ దేశాలు పట్టి తిరగడం కన్నా life ఏముంటుంది!


Travel Blogger in Film Montage Song
ఇలాంటి అమ్మాయి charater తో fiction చేద్దామని ఉండేది, Montage Song లాంటి travel fiction కన్నా better film ఏముంటుంది ? దివ్య కన్నా better actress ఎవరు దొరుకుతారు, so తనతోనే చేసాం. కల్పిత పాత్రలకన్నా నిజ జీవితంలో దొరికే పాత్రలే మాకు ముద్దు, దివ్యకి travelling ఇష్టం and అందరితో బాగా కలిసిపోతుంది మాట్లాడుతుంది, exactly అదే చేయించాం. అనుకోకుండా బిందూని కలిసి ఫ్రెండ్ అయ్యి ఆ తర్వాత నాకు ఫ్రెండ్ అయ్యి మాతో హోలీ చేసుకుని అలసిపోయి మా రూమ్ లోనే నిద్రపోయి, మాతో డిన్నర్ చేసి, నన్ను బాబా cafe అనే place కి తీసుకెళ్లి… ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఏం జరిగింది ? సినిమాలో చూడండి.


Celebrating Holi
పైన సీన్స్ మాత్రమే కాదు తన ద్వారా లోకల్ జనాల జీవితాల్ని explore చేయడానికి కూడా ప్రయత్నించాం. తను మాట్లాడిన వాళ్లలో ఒక musician,ఒక hotel owner,ఒక అందమైన రిసార్ట్ ని maintain చేసే ఒక కుర్రాడు, ఫిలిం ఇండస్ట్రీలో Makeup Man గా కొన్నేళ్లు చేసి తర్వాత దాన్ని వదిలేసి విరుపాపరగడ్డి లో రిసార్ట్ నడుపుతున్న ఓనర్, వీళ్లందరితో మాత్రమే కాకుండా బిందు తో ఒక long walk & conversation సీన్ కూడా ఉంటుంది. Actors నడుస్తూ కబుర్లు చెప్పుకునే సీన్లంటే మాకూ మా కెమెరామెన్లకి ఎంత ఇష్టమో మరోసారి ఈ సినిమాలో చూడొచ్చు, చాలా సీన్లుంటాయి.


Travel Blogger – Divya.
– Camp శశి