Latest Blog

Film Montage Song – Bindu Chandramouli

 

తను fb ఫ్రెండ్. తన పోస్టుల్లో నాకు బాగా నచ్చినవి “నాకెప్పుడూ ఈ మధ్యతరగతి చీరకట్టు పాత్రలేనా” అని పెట్టె పోస్టులు. నాకూ ఈ ఆలోచన ఎప్పుడో వచ్చింది, కేవలం బిందు గురించి కాదు మన socalled అమ్మ అక్క వదిన పాత్రలు మరీ మూసకే విరక్తి వచ్చేంత మూసగా ఎందుకుంటాయి ?

25 ఏళ్ళ అమ్మాయిల కనిపిస్తే అక్కో చెల్లో 30 అనిపిస్తే వదిన 35 లా ఉంటె తల్లే. మళ్ళీ వీళ్ళ characters ఏమన్నా డిఫరెంట్ గా ఉంటాయా ఆ age ని బట్టి, అస్సలుండవు, ఒక్కసారి చీరకట్టి వదిన ఐంది అంటే అంతే జీవితకాలం వదినె . లుక్కుల్లో కూడా పెద్ద తేడా ఉండదు, ఏ వదిన పాత్ర ఏ సినిమాలోదో గుర్తుపట్టలేనంత దగ్గరగా ఉంటాయి.

ఇదే actresses బయట ఎంత డిఫరెంట్ గా beautiful గా Stylish గా ఉంటారు అంటే , అర్రే ఇలాంటి look screen మీద ఉంటె ఎంత బాగుంటుంది అనిపించేది. చాలా సార్లు అనుకున్నా రెండు మూడు సార్లు ట్రై చేశా regular industry చీర కట్టు స్త్రీని డిఫరెంట్ గా చూపిద్దామని. బిందు fb pics చూసి Montage Song లో తను బాగుంటుంది అనిపించింది, చేస్తుందో లేదో? ఎందుకంటే నా gf రోల్ అది. మొహమాటపడుతూ అడిగా “done dates fix చేసి చెప్పు శశి” అంది.

హమ్మయ్య మరీ ఇంత సింపుల్గా ok చెప్పేసింది ఏంటి అనుకుని, షూట్ ప్లాన్ చేసుకున్నాం, హంపి వెళ్ళాం, షూట్ చేసాం వచ్చేసాం. తనతో షూటింగ్ ఎంత ఈజీగా జరిగిపోయిందంటే ఒక్కటంటే ఒక్క complaint కూడా లేదు. ఎప్పుడు ఎంతసేపు షూట్ అన్నా done  , మా అందరికన్నా ముందే నిద్రలేచి రెడీగుండేది. రషెస్ చూసాము Bindu is Just బ్యూటిఫుల్. తన acting గురించి కట్ మొదలయ్యాక తెలుస్తుంది, కానీ కట్ చేయకుండానే కొన్ని సీన్స్ లో చాలా బాగా చేసింది అనిపించింది. బిందు, నీ unconditional support కి ఏదన్న కొత్తగా ట్రై చేయాలన్నా నీ ఉత్సాహానికి my hugs. మాకేమన్నా డబ్బులొస్తే నీకు కూడా ఇస్తాము

– Camp శశి

ఈ సినిమా finish చేయడానికి మాకు 10,00,000/- కావాలి, డొనేట్ చేయదలచుకున్న వాళ్ళు ఈ కింద options ద్వారా చేయవచ్చు.

%d bloggers like this: