Latest Blog

French Lady Laura

Laura 28ఏళ్ళ french అమ్మాయి, విరుపాపరగడ్డి లో పరిచయం మాకు.

నేను 12ఏళ్ళ క్రితం first time వెళ్ళినపుడు restaurants లో పరుపుల మీద పడుకుని food order చేసుకుని పుస్తకాలు చదువుకుంటూ lazy గా ఒంటరిగానో partner తోనో  డొల్లుతున్న foriegners ని చూసి, చూసీ చూడనట్టు మళ్ళీ మళ్ళీ చూసి కుళ్ళుకుని, నా దిక్కుమాలిన మధ్యతరగతి జీవితాన్ని తిట్టుకున్నాను. ఎలాంటి inhibitions లేని వాతావరణం అది, నాకు కొత్త. తర్వాత regular గా వెళ్లడంతో అలవాటు అయిపొయింది.

Laura French Traveller

Laura warming up in a nature

ఈసారి వెళ్ళినపుడు shesh besh restaurant లో చూసిన అమ్మాయి laura, మాకు అక్కడొక local friend ఉన్నాడు, KK, hyderabad అతనే కానీ అక్కడ ఉంటున్నాడు. తనూ  laura ఫ్రెండ్స్, నా కక్కుర్తి కొద్దీ ఆ అమ్మాయి act చేస్తుందా అని అడిగా, లేదని చెప్పాడు.మేము shooting చేసుకుంటూ తిరుగుతూ రాత్రి పూట restaurant లో relax అవుతున్నప్పుడు KK,  laura మాతో joion అయ్యేవాళ్ళు, పెద్దగా మాట్లాడేది కాదు తను. పరిచయం అయితే చేసాడు KK. నాలుగు రోజుల తర్వాత మాటలు మొదలయ్యాయి, ఏవో చిన్న చిన్న conversations.

Shoot అయిపోయే time కి మా అందరికి బానే ఫ్రెండ్ అయిపొయింది laura. France లో చిన్న ఊరు తనది, మసాజ్ therapist. Travelling అంటే ఇష్టం, అందరిలానే ఇండియాకి రాగానే తను గోవా వెళ్ళింది, అక్కడ జరిగిన ఒక bad experience తో బయటపడి ఎవరో చెప్తే హంపి బయలుదేరింది.  bus లో ఒక bangalore అతను పరిచయం అయ్యి guide చేసాడు. అసలు ఇలా ఉంటుంది ఈ ఊరు అని అనుకోలేదంట, ఒక రకంగా తను కోరుకున్నట్టు ఉంది, ప్రశాంతమైన వాతావరణం, friendly మనుషులు, మంచి ఫుడ్, రోజుకి 200/- కి ఉండటానికి ఒక room, KK & Gang మంచి friends అయిపోయారు. నేను అడిగా తనని “మీ ఊరుని miss అవుతున్నావా” అని “అస్సలు లేదు, ఇదే నా home లాగుంది” అంది. విరుపాపరగడ్డి ఎంత నచ్చేసిందో ఆ అమ్మాయి మాటల్లో అర్ధమైపోయింది.

Laura French Traveller

A touch of Nature.

అలా మా shoot  చివరికి వచ్చేసరికి మాతో చాలా comfortable zone లోకి వచ్చేసింది, Montage Song లో కొన్ని షాట్స్ లో కనిపిస్తుంది, షూట్ అయ్యాక rushes చూపిస్తే చాలా excite అయ్యి next time చేస్తాను అంది. దొరికింది కదా chance అని Story Discussion నిరుద్యోగ నటులు videos చూపించాను, మ్యూజిక్ నచ్చింది.

%d bloggers like this: