Latest Blog

Montage Song లో హంపి హోలీ సంబరాలు

 

పన్నెండేళ్ళనుంచి హంపి వెళ్తున్నా హోలీ టైంలో ఎప్పుడూ వెళ్ళలేదు, హోలీ సంబరాలతో season end అయిపోతుంది. అక్కడ హోలీ ఎంత బాగా జరుగుతుందో చాలా విన్నాను, మా షూటింగ్ ప్లాన్ కూడా ఆ డేట్ ప్రకారం ప్లాన్ చేసుకున్నాం. నదికి అటుపక్క హంపీలో ఒకరోజు ముందు జరుగుతుంది హోలీ తర్వాత రోజు విరుపాపరగడ్డిలో. హోలీకి ముందు రోజు రాత్రి ఊరి బయట భోగి మంట, ఊరి మధ్యలో డప్పులతో celebration మొదలవుతుంది , అక్కడనుంచి అందరూ డాన్సులు వేసుకుంటూ ఊరి బయటకు వెళ్తారు, వెళ్తున్న వాళ్లతోపాటు మిగతా resorts వాళ్ళు జాయిన్ అవుతుంటారు.

నేనూ బిందూ దివ్య కూడా వాళ్లతోపాటు నడుస్తున్నాం అప్పటికింకా మేము డాన్సులు మొదలుపెట్టలేదు, ఊరి జనాలు ఫారెనర్స్ విపరీతమైన energy తో ఊగిపోతున్నారు. అలా ఊరేగింపు మధ్యలో RX100 అజయ్ కనిపించాడు రోడ్డు పక్కన నిలబడి తన టీంతో, అందరం ఒక చిన్న surprise కి గురై hug చేసుకుని అజయ్ దివ్య డాన్స్ మొదలుపెట్టారు, ఇదంతా కెమెరాలో రికార్డు అవుతోంది, ఆ ఊరేగింపు కూడా సినిమాలో భాగమే.

Holi Celebrations at Hampi

Holi Dance

Story Discussion  Season 01 లో అతిధి పాత్రలో కనిపించిన అజయ్ ఈసారి అనుకోని అతిధి పాత్రలో Montage Song లో కూడా కనిపిస్తాడు. అక్కడనుంచి ఊరి బయటకు వెళ్లి ఆ భోగి మంట దగ్గర చాలాసేపు గడిపి షూట్ చేసాం. డప్పులు ఆగిపోయాక DJ మొదలైంది అక్కడ జనాల ఊపు చూసి నేనూ జనాలతో కలిసిపోయి తీన్మార్ స్టెప్పులు వేస్తూ జనాల్ని ఛాలెంజ్ చేస్తూ “Come on dance with me, iam from Hyderabad” అని రచ్చ చేసి మట్టిమీద నాగిన్ స్టెప్పులేసి ఇంకా చాలా చేశాను. తర్వాత రోజు ఊర్లో తిరుగుతుంటే అర్ధమైంది నేనెంత చెలరేగానో, ఊర్లో వాళ్ళు చాలామంది గుర్తుపట్టి నా డాన్స్ గుర్తుచేస్తుంటే ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి thanks చెప్పాను.

People Celebrating Holi in Hampi

Tourist Celebrating Holi

భోగి తర్వాత రోజు పొద్దున్నే హోలీ రోజు అజయ్ వచ్చి మా అందరిని నిద్రలేపేసాడు, మేము కూడా రెడీ అయిపోయాం హోలీ సంబరాలకి. ఊరి మొదట్లో ఉన్న రిసార్ట్ దగ్గర డప్పులు డాన్సులు ఊరేగింపు మొదలై భోగి మంట వేసిన చోట ముగుస్తుంది. మేమున్న రిసార్ట్ Shesh Besh దగ్గరకి ఊరేగింపు వచ్చేసరికే చాలా మంది జనాలున్నారు మేమూ జాయిన్ అయిపోయాం షూట్ జరిగిపోతోంది. నిన్న రాత్రికన్నా double energy తో ఉన్నారు జనాలు, అంతా రంగులమయం అరుపులు కేకలు ఎవరు ఎవరికి రంగుపూస్తున్నారో అర్ధం కావడం లేదు, జెర్మన్లు, ఇస్రాయిల్ వాళ్ళు , ఫ్రెంచ్ వాళ్ళు, UK వాళ్ళు, రష్యన్లు, అమెరికన్లు ఇంకా ఆసియా వాళ్ళు ఇండియాలో వేరే ఊళ్ళనుంచి వచ్చిన జనాలు ఊరిప్రజలు అందరూ ఎంత ఆనందంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారంటే పొలాలు రిసార్ట్స్ మధ్య చిన్న రోడ్డులో దాన్ని చూడటం amazing experience.

People Celebrating Holi in Hampi

People Celebrating Holi in Hampi

మేము చేయగలిగినంత షూట్ చేసాం,  జనాల ఎనర్జీ చూస్తుంటే ఇప్పట్లో ఇది పూర్తవదు, వాళ్ళతో వెళ్తే మేము tired అయిపోయి మిగతా డే అంతా పోతుంది అని కొంతదూరం వెళ్లి వెనక్కి వచ్చేసాం. కానీ ఖచ్చితంగా ఒక most beautiful హోలీ scene షూట్ మాత్రం చేసాం.

మేము నాలుగింటికి రిసార్ట్ లో షూట్ చేస్తుంటే అప్పటికీ డప్పుల మోతలు వినిపిస్తున్నాయి. అయిపోయాక చాలామంది నదికి వెళ్లి స్నానం చేస్తారు అది షూట్ చేస్తే బాగుంటుంది అని ఒక లోకల్ ఫ్రెండ్ చెప్పాడు కానీ కుదరలేదు.

ఈ సినిమా finish చేయడానికి మాకు 10,00,000/- కావాలి, డొనేట్ చేయదలచుకున్న వాళ్ళు ఈ కింద options ద్వారా చేయవచ్చు.

%d bloggers like this: