Latest Blog

How i Understood The Taxi Driver.

 

[ట్యాక్సీ లో మేం ముగ్గురం]

“ఈ నిద్దురెందుకో రానేరాదు . కొన్ని నెలలైంది నిద్రపోయి. నిద్రపోవాలనే ఉంటుంది కానీ, పడుకొని కళ్ళు మూసుకోగానే పేకలు కలిపినట్టుగా, రైళ్లు పరిగేడుతున్నట్టుగా ఒకటే ఆలోచనలు. వాటిలో ఒక్కదాని పట్టుకుందామన్నా. ఒక్కటీ చిక్కదు. నిద్రపోకపోతే అలసట వస్తుందీ అంటారు, నాకు అదీ రాదే!

అయినా, నిద్రపోకపోవాడం నాకేం సమస్యలా అనిపించడం లేదు. మీరంతా అంటుంటే తప్ప. అవునూ… మీరంతా ఎందుకు నిద్రపోతారు? అది అంత ఇంపార్టెంటెంటా? నిద్రపోకుండా అంతా మెలుకువగా ఉండి హాయిగా పనిచేసుకోవచ్చుగా. రాత్రిని ప్రపంచమంతా స్మశానం చేస్తారెందుకు? నిద్రపోయి ఏం సాదిస్తారు? నిద్రపోతే ఏం అవుతుందీ? మహా అయితే కలలోస్తాయి. అంతే కదా! అవి ఎలాగు నిజం కాదు. మరి నిజం కాని దానికోసం ఎందుకంత వెంపర్లాట?

అదే నిద్రపోకుంటే మహాఅయితే కళ్లెరబడతాయి, నాకు మల్లే. కానీ, జీవితమంతా కళ్ళు తెరిచివుంటే యెంత బావుంటుంది! హాయిగా చీకటిని చూడొచ్చు. కానీ మీరు సగం జీవితం నిద్రలోనే గడుపుతారు. “నిద్రపోవడం ఏం రోగంరా బాబు మీకు?

ఏమైనా అంటే, అది సహజసిద్ధమైనది ప్రకృతిచర్యా అని మీ సోమరిపోతుతన్నాన్ని ప్రకృతిపైన రుద్దుతారు. సెక్సుకు మల్లే. ఏవో కారణాల కోసం సెక్సు చేసి, దేహానికి అవసరం, అదీ… ఇదీ అని ఎవడో మీకులాంటి సోమరి చెప్పిన మాటలు చెప్తారు. కేవలం పిల్లని కనడానికి సెక్స్ చేస్తాం అని పచ్చి అబద్ధం మాత్రం చెప్పకండి దయచేసి”.

రాబర్ట్ డినేరో కి సెక్సు సినిమాలు చూసి అసలు ఏం ఉంటుంది అందులో అంతగా అని తెలుసుకోవాలీ అనిపించిందో ఏమో. ప్రతిరోజు సెక్స్ సినిమాలు ధియేటర్ కి వెళ్లి చూడడం మొదలు పెట్టాడు. టాక్సీ గిరాకీ లేనప్పుడు. అలా ఎన్నో రోజులు చూశాడు. కొన్నాళ్ళకి అతను ఇలా అనుకుంటున్నాడేమో అని సినిమా మొదలవ్వగానే రాబర్ట్ డినేరో మస్తికంలోకి వెళ్లినట్టు అనిపిస్తున్న నాకు అనిపిస్తోంది. మార్టిన్ స్కర్సేసే కి ఆ విషయం తెలియదు. ఆయన తనని రాబర్ట్ లో చూసుకోవడంలో మునిగి ఉన్నాడు. ఇది జరిగి అయిదేల్లయింది అప్పటినుండీ నేను అక్కడే ఉంటున్నా.

“ఇప్పటికి వందకు పైగా సెక్స్ సినిమాలు చూసుంటా. ఏముంది అందులో?  ఆడా-మగా సహజ వస్త్రాల్లోకి వస్తారు. హత్తుకుంటారు, ముద్దులు, దాచుకున్న బాగాలు ముట్టుకోవడం, కొన్నినిమిషాల యుద్ధం, అంతే!

తర్వాత రియాలిటీ లోకి వచ్చేస్తారు. అంతే అంతకుమించి ఏముంటుంది?

ఎదో ఉండి ఉంటుందిలే. లేకపోతే ఎందుకు ఇన్ని కోట్ల మందికి నిద్ర-సెక్స్ పిచ్చి పట్టివుంటుంది. నాకే తెలియకపోవచ్చు.కానీ, మీ అందరికీ తెలియనిది వాటిలో ఏదో ఉంది. అది మీకు తెలియదని నా విశ్వాసం.

నిద్రకి ప్రశాంతత కావాలి రైలు స్టేషన్లో ఆగాలి. మీది గమ్యం తెలియని ప్రయాణం. అందుకే ప్రశాంతత అనే స్టేషన్ రాదనుకుంటా. ఏ స్టేషన్ వస్తే అక్కడే ఆగిపోతారు. నాదైతే ప్రయాణమే కాదనుకోండీ. జోకర్ల పైన ఆధారపడ్డ జీవితాలు మీవి. మిగితా పేకలపైన గౌరవం వుండదు మీకు. నాదైతే ఆట కూడా కాదనుకోండీ. సెక్స్ లో ప్రేమ తప్ప అన్నీ వోలుకబోసుకుంటారు అనిపిస్తుంది. అందుకే మీకెప్పుడూ తృప్తి దొరకదు. పోర్న్ లు వేరేవాళ్ళూ కావాలి”.

అలా ప్రేమ గురించి ఆలోచించాడో లేదో తను ఒక డ్రాప్ చేసినప్పుడు ఒక పార్టీ కార్యాలయంలో పనిచేస్తూ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. అప్పుడు ఇలా అనుకుంటున్నాడేమో.
“ఆమెని చూస్తుంటే నా మెదడులో తేలికగా సంతోషంగా అనిపిస్తోంది. ఆ అనుభవాన్ని దగ్గరగా చాలా దగ్గరగా అతి దగ్గరగా అనుభవించాలని ఒకటే ఆలోచనలు. ‘ప్రేమ’ అది పుస్తకాల్లో, సినిమాల్లో ఉన్నంత బాగా బయట ఎందుకు ఉండదు? ఉంటుది కానీ కేవలం మన తలలో ఆ చదివిన, చూసిన రీల్లు అయిపోయేoతవరకే. అందులో కనిపించని ఒక్క ఫ్రేమైనా వచ్చిందా, అంతే ఇక ప్రేమ జేజెమ్మ కూడా నచ్చదు. నాలో ఆమెకి తెలియని పేజీ లేదా ఫ్రేము కనిపించిందేమో”.

మార్టిన్ కి ప్రేమ పైన గొప్ప అభిప్రాయం ఉంది అనుకుంటా. అందుకే రాబర్ట్ ప్రేమని విఫలం చేశాడు. అది కూడా చాలా చిన్న కారణానికి రాబర్ట్ ఆ అమ్మాయిని తను రోజూ వెళ్ళే చోటుకి తీసుకెళ్లాడు అంతే! తర్వాత మార్టిన్ కి తిక్క రేగడం మొదలైంది అనుకుంటా చాలా సీరియస్ గా అయిపోయాడు. బయట కాదు లోపల. సరైన ప్లానింగ్ ఉన్నోడు టెన్షన్ గా సీరియస్ గా కనిపించడు. అది పనిలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అదే నూరి పోశాడు రాబర్ట్ కి.

“ఎక్కడ చూసినా ఇదే Dissatisfaction జనాలకి ఎదో కావాలి, ఏం కావాలో తెలీదు. ఎవరితో ఎవరికీ పడదు. తెల్లోలకి నల్లోలంటే పడదు, నల్లోలకి తెల్లోలంటే ఇష్టం ఉండదు. ఇలాంటి Confused Peopleని పాలించడానికి పాలకులు. మళ్లీ వాళ్లని పాలకులు చెయ్యడానికి ఈ Confused People సపోర్టు. ఏంటీ గందరగోళం?”. “నేను ఆ నల్లవాళ్ళ ఏరియా కి డ్రాప్ కి వెళితే చూస్తుంటాను వాళ్లని. వీళ్లు ఇలా అరాచకవాదులుగా తయ్యరవ్వడానికి ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలే కారణం అని. పెద్ద పెద్ద ఆఫీషియల్ పుస్తకాల్లో వివక్ష గురించిన రూల్స్ మారాయి గానీ. ఆలోచనల్లో కాదు. అవి పాటించే కొంతమంది కూడా ‘తప్పక’ పాటిస్తున్నారు గానీ లేదంటే మళ్లీ ఆటవికమే”.

“ఎంత దరిద్రం ఆసలు, ఎవరి ప్రయోజనం కోసం? అసలు ఎవరు బాగుంటున్నారు? పదమూడేళ్ళు కూడా నిండని అమ్మయి వేశ్యా? మళ్లీ ఆమెని రాత్రికి కొన్నవాడు ఆమెని కొట్టడమా?”
మార్టిన్ చదివాడో చూశాడో తెలియదు కానీ, ఈ విషయన్ని అస్సలు సహించలేక పోతున్నాడు. ఎదో విధ్వంసం చేసేవాడిలా రాబర్ట్ దగ్గరికి వెళ్లి. అతని కళ్ళలోకి చూస్తూ మొత్తం వివరించాడు తనని అతనిలో చూస్కోడానికి. రాబర్ట్ కి మొత్తం అర్థమయ్యింది.

“ఇంత దీనమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? దీనికి ఎవరు కారణం? కారణమైన వాళ్ళని ఏం చెయ్యాలీ?…చం…పే…యాలి. అవును చంపే….య్యాలీ. ఆ అమ్మాయిని కొన్న వాడిని కూడా. షూట్ చేసి పారేస్తా నా కొడుకుల్ని. యెస్…. ఐ విల్ కిల్ థెం, హే… హే…హే… హే.. ఏం ఆలోచిస్తున్నావు? నేనే… నాతోనే మాట్లాడుతున్నా… నిజమేనా? ఓసారి అద్ధంలో చూస్కొని అడుగూ.

You talking to me…? You talking to me? You talking to me?  Yes నేనే Confirm. ఎవడేవడికో వోట్లేసి/సపోర్ట్ చేసిన తిన్నామ్మా పడుకున్నామా బార్ కేల్లమా, నలుగురూ నన్ను మెచ్చుకున్నారా అనే నీచపు బ్రతుకు కూడా కాని వాళ్ళ కోసం కాదు నేను ఆలోచించేది, నా కోసం. I am taking to me. ఆ రాజకీయపోన్ని చంపాలి, ఆ చిన్న అమ్మాయిని అక్కడి నుండి విడుదల చెయ్యాలీ. వీటికి గన్ను కావాలీ… గన్ను కొనడం న్యూయార్క్ నగరంలో పెద్ద విషమేం కాదు. నచ్చనోడిని కాల్చి పారేయడం కూడా పెద్ద విషయం కాదు, చంపాలనే కోరిక ఉండాలి సింపుల్”
మార్టిన్ అనుకున్నది చేసేశాడు తనలోని అరాచకాన్ని రాబర్ట్ లో నిద్ర’లేపాడు. రాబర్ట్ అందరిలాంటి వాడు కాబట్టి తనూ లోపల అదే కాబట్టి. బయటికి అందరికీ అది అర్థమయ్యేలా విచిత్రంగా రాబర్ట్ కి గుండు గీయించాడు. తన మిషన్ పూర్తి చేయించడానికి.
“ఒక్కోకడి పుచ్చ లేపుతుంటే, నాకు కొంచెం కూడా కంగారు లేదే?…. అదిగో ఇంకొకడు వచ్చాడు కాల్చి పడదోబ్బెయ్.. . ఈ రాక్తన్ని చూస్తున్నా నాకే ఫీలింగ్ లేదు. ఇంకొకడు…. వాడి చేతిలో గన్నుంది ఆ చేయ్యినే కాల్చేయి… అందరి రక్తం… నీళ్లలా పారుతుంది. కాసేపయ్యాక నా పరిస్థితి ఏంటి? ఏంటీ ఏంటి…? రా పిచ్చి. రే ఇంకోడదు వచ్చాడు… ఎంత మందున్నా రండిరా… మిమల్ని చంపి నేను చావడానికే వచ్చా.. ఈ ముసలి నాకొడుకుని చంపితే గొడవ ఉండదు. ఈడిని మాత్రం పక్కా పుచ్చ లేపుతా, నోట్లో గన్ను పెట్టి పెల్చుతా… ఫినిష్.. ఫినిష్…. హా…. హాయిగా ఉందీ… ఎన్ని రోజులకి కళ్ళు బరువేక్కుతున్నాయ్….. నిద్ర… నిద్రొస్తోంది… ఈ అమ్మాయికి ఫ్రీ డం దొరికిందిగా ఎందుకు ఏడుస్తోందీ? సంతోషంతో కాబోలు.. అయినా అవ్వన్నీ నాకెందుకు? నాకు మాత్రం నిద్రొస్తుంది ఇప్పుడు ఎవ్వరొచ్చినా, ఏమైనా నాకనవసరం. నిద్రొస్తోంది. కాల్చేస్తే … కాల్చేసుకోండి బు….ష్ బు…ష్… నేను నిద్రపోతా”

మార్టిన్ ఇంకా చెప్పలనుకున్నదేదో చెప్పాకా. నేను మాత్రమే మార్టిన్ స్కర్ససే ని అలాంటి పరిస్థితిలో చూశాను, తనని తానూ స్క్రీన్ పైనా చూసుకొని మొఖం అంతా వెలిగిపోతూ… ఆనందంతో వచ్చే దుఖాన్ని ఆపుకుంటూ. గర్వంగా రాబర్ట్ ని చూస్తున్నాడు. కాసేపటికి తనకి నిద్ర ముంచుకు వచ్చినట్టుంది, ట్యాక్సీ వెనకాల సీట్లో అలాగే తల వెనక్కి వాల్చాడు. Titels పడుతుండగా రాబర్ట్ మా కారు నడుపుతూ ఉన్నాడు. నాకూ కాసేపటికి నిద్రోచ్చేసింది.

సాయి యోగి

%d bloggers like this: