Latest Blog

I Love you Mira by Camp Sasi

 

If we don’t tell our own stories, no one else will – Mira.

ఎంత సింపుల్గా చెప్పావు మీరా , అందుకే నువ్వంటే ప్రేమ

Nothing is more powerful than seeing your own language,your own color,your own people,your own dramas on screen – Mira Nair

Mira Nair

Mira Nair

ఇలాంటి మాటలు చెప్పి ఉత్తేజపరుస్తావు చూడు అందుకే నువ్వంటే పిచ్చి ప్రేమ.

నేను చూసిన మీరా సినిమాలు మూడే , సలాం బాంబే, కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్. ఇది నాకు అలవాటు, నాకు బాగా నచ్చిన దర్శకుల సినిమాలు అన్నీ చూసేయాలని అనిపించదు. ఎప్పుడు కుదిరితే అప్పుడే చూస్తా. ఈ మూడిట్లో సలాం బాంబే , మాన్సూన్ వెడ్డింగ్  నన్ను విపరీతంగా influence చేసిన సినిమాలు. సలాం బాంబే చూసాక ఫకీర్ అనే ఒక రోడ్డు పక్క చాయ్ అమ్ముకునే కుర్రాడి కథ అనుకున్న, నా మొదటి సినిమా అదే అవ్వాల్సింది,అవలేదు, అవకపోవచ్చు కూడా. సలాం బాంబే మేకింగ్ గురించి చదివితే మీరాకి సినిమా అంటే ఎంత ప్రేమో అర్ధం అయింది . తనకి తను కేవలం సినిమానే ప్రేమించదు , తన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని,వాళ్ళ రంగుని ప్రాంతాన్ని, అన్నింటిని ప్రేమించేస్తుంది. అవే తన కథలు, సినిమా కథ అంటే ఎక్కడినుంచో ఊడిపడాల్సిన అవసరం లేదు అని నమ్మిన మనిషి. మీరా చెప్పిన ఈ మాటే నా చుట్టూ ఉన్న కథలను వెతుక్కునేలా చేసింది.

 

Indie birds

Indiebirds – Crowdfunding – Mira Nair.

We all know the power of film; we all know there’s almost nothing more powerful than to see people on film that look and talk like you, like we do. – Mira Nair

నీ confidence నీ sense of humor నీ నవ్వు నీ కళ్ళు … అందుకే నువ్వంటే ప్రేమ