Latest Blog

Montage Song by camp sasi

అందరూ నేనేదో పాట తీసా అనుకుంటున్నారు, కాదు ఇది ఫిల్మే, Montage Song is a feature film. ఎంత లెంగ్త్ వస్తుందో ఇప్పుడే చెప్పలేను కానీ 90+ అయితే వస్తుంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చాక విన్న మాట అది. రాకముందు బ్రిటిష్ లైబ్రరీలో ఫిల్మ్ మేకింగ్ పుస్తకాలు చాలా చదివాను కానీ ఈ Montage Song అనేది ఎక్కడ కనపడలేదు, Montage ఉంది, దాని గురించి చాలా మంచి బుక్స్ దొరికేవి. అంత లావు ఇంగ్లీషు పుస్తకాలు పూర్తిగా చదవలేక కొంచెం కొంచెం చదివినా Montage మీద కొంత అవగాహన వచ్చింది.

అమ్మాయి, అబ్బాయి పాట పాడకుండా బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే రోడ్ల మీద గాలి తిరుగుడు తిరుగుతూ పానీ పూరీలు తింటూ చిన్న చిన్న లేకి పనులు చేసుకుంటూ  అప్పుడపుడు ఒకరినొకరు కామంగా చూసుకుంటూ టక్కున నార్మల్ అయిపోయి మళ్ళీ నడుస్తూ పరుగెత్తుతూ ఇలా సాగిపోయే పాటే Montage Song అని, ఆ సాంగ్ లో ఎంతో కొంత కథ ఖచ్చితంగా చెప్పాల్సిందే అని తెలుగు నవ యువ దర్శకులందరూ భీష్మించుకుని కూర్చున్న రోజులు అవి. ఇలాంటివే ఫ్రెండ్స్ మధ్య ఫ్యామిలీల మధ్య కూడా జరగొచ్చు.  అదొక కథ చెప్పే బలమైన టూల్ అని అర్ధమైంది. మీకు తెలుసా అసిస్టెంట్లు అసోసియేట్ దర్శకులు ఖాళీగా ఉన్నపుడు కథ కాకుండా Montage Song కోసం సీక్వెన్స్ లు రాస్తుండేవాళ్లు, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తున్న సినిమా కోసం కూడా.

Indie Birds

Montage Song

చిన్నప్పటినుంచి అలాంటి పాటలు చాలా చూసినా ఫిలిం ఇండస్ట్రీ లో దాని “విలువ” చూసి, అప్పటినుంచి Montage Song ల మీద కన్నుపడింది. అబ్బో చాలానే చూసేసాం ఎంత ఈజీ ఇలా పాట తీయడం అనిపించేది. అదిరిపోయే లొకేషన్స్ లో జస్ట్ నడిపించి తీసేయొచ్చు, చిన్న చిన్న రొమాన్సులు నుంచి  కావాల్సినంత erotica కూడా చేసుకోవచ్చు. అలా నడిపించి తీసిన పాటల్లో నా మెదడులో పాతుకుపోయింది అంతం లో “నీ నవ్వు చెప్పింది నాతో”, ఆ పాట చూసి ఊర్మిళాని ప్రేమించేసా, తన పాత్ర పేరు “భావన” ని ప్రేమించేసా. తొమ్మిది సార్లు చూసా థియేటర్ లో, పాట రాగానే ఏదో ఫీలింగ్, ప్రేమించాల్సిందే, అది కూడా భావన అనే పేరున్న అమ్మాయి అయితే ఎంత బాగుంటుంది. ఇలా నాకు  “పిల్ల ప్రేమ” ఆలోచనలు కలిగించిన పాట అది. దాని తర్వాత గాయం “అలుపన్నది ఉందా” ఈసారి in love with రేవతి, ఆర్జీవి అమ్మాయిలు ఎంత ఇండిపెండెంట్ గా ఉంటారో. నేను అనుకునే అమ్మాయిల పాత్రలు ఆ influence నుంచే వస్తాయని నా ప్రగాఢ విశ్వాసం.

Ok , coming back to Montage Song, Sheesh Mahal లో అన్ని పాటలు అవే, మాంటేజ్ పాటలు. టీనేజ్ అమ్మాయి అబ్బాయి లేకి సిటీ ఔటింగ్, డేటింగ్, హగ్గింగ్, వాకింగ్, టాకింగ్ పాట కోరిక తీర్చుకోవాలని చేసిందే  “కంగల్ రెండు” పాట. ఒకే దెబ్బకి రెండు కోరికలు తీరిపోయాయి, తమిళ్ పాట & టీనేజ్ కపుల్.

Indie Birds

A still from Montage Song

నిరుద్యోగ నటుల్లో పాటగాడు కనిపిస్తూ పాడుతుంటే మాంటేజుల పాట తీసాం, ఇది కొన్నివేలసార్లు వాడిన పురాతన కాన్సెప్ట్. ట్రై చేద్దాం సరదాగా పోయేదేముంది, వస్తే కొన్ని visuals అయితే వస్తాయి అని, రోహిత్ ఒక చిన్న టీం ని వేసుకుని, టీం అనకూడదు ఒక నలుగురు ఫ్రెండ్స్ వరంగల్ వెళ్లి రాత్రంతా chill చేసి తెల్లవారుజామున షూట్ మొదలుపెట్టి జగదీష్ ని నడిపించి బస్సెక్కించి ట్రైన్ ఎక్కించి హైదరాబాద్ తీసుకొచ్చి పాట ముగించాడు. మంచి Montage Song.

Indie Birds

A still From Montage Song.

Montage Song టైటిల్ బాగుంది, సిటీలోనే తీస్తే బాగా చీప్ లో చుట్టేయొచ్చు, కానీ హంపీలో చేస్తే అనే ఆలోచన రాగానే perfect అనిపించింది. గత పన్నెండేళ్లలో ఏడెనిమిది సార్లు వెళ్ళుంటా. హంపీలో విజయనగర సామ్రాజ్య శిధిలాలు నదికి ఒక పక్కన అయితే నదికి అటుపక్క విరుపాపరగడ్డి village. First time ఆ place కి వెళ్ళినపుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా,నిజం. సిటీకి 7-8 గంటల జర్నీ దూరంలో  ఇలాంటిదొకటి ఉందా, అద్భుతం అనిపించింది. ఒకే ఒక్క వీధి ఉన్న ఊరు అది, ఒక పక్క పొలాలు రాళ్ళ కొండలు ఇంకో పక్క మొత్తం రిసార్ట్స్. ఎటు చూసినా ఆర్టే, గోడల మీద బొమ్మలు, ఎప్పుడూ ఏదో ఒక సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. అంతర్జాతీయ వంటకాల దగ్గరనుంచి దాల్ చపాతీ వరకు దొరుకుతాయి, అందంగా చెట్ల మధ్య ఉండే cottages అయితే magical గా అనిపిస్తాయి. 200/- నుంచి 2000/- వరకు ఉండటానికి accomodation దొరుతుంది. నవంబర్ లో వెళ్తే మనం వేరే దేశంలో ఉన్నామేమో అనిపిస్తుంది, ఎటు చూసినా విదేశీయులే. చక్కగా చిన్న చిన్న బట్టల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పగలంతా tan అవుతుంటారు. Adventurous  people కి  కావాల్సినన్ని కొండలు, దూకి ఈతకొట్టడానికి తుంగభద్ర నది దాని పాయలు ఉంటాయి. ఎవరు ఎవర్ని పట్టించుకోరు, వెరీ ఫ్రెండ్లీ people. చలికాలం రాత్రులైతే fantasy లానే అనిపిస్తాయి. అన్ని resorts కళ కళ లాడుతూ, కొన్ని చోట్ల live music నడుస్తుంటుంది. కావాల్సినంత ప్రకృతి ప్రశాంతత. ఇంతకన్నా లొకేషన్ ఏం కావాలి.

చిన్న కథ ఒకటి అనుకున్నా, మళ్ళీ meta ఐడియా నే, John Victor అనే నలభై ఏళ్ళ ఎడిటర్ ఒక “montage Song” ఎడిట్ చేయడానికి హంపికి వెళ్తాడు, తన gf తో. ఆ పాట బాగా వస్తే ఒక యువ దర్శకుడికి సినిమా ఛాన్స్ వస్తుంది. So ఏం జరిగింది? ఏదో జరిగిపోదు, చాలా smooth గా ఒక హాలిడేలా ఉంటుంది సినిమా.

ప్లానింగ్ మొదలుపెట్టేసా, 1,75,000/- ఉంటె షూట్ అయిపోతుంది. మెల్లిగా జనాల్ని కెలకడం మొదలుపెట్టా, దుబాయ్ నుంచి ఒక  ఫ్రెండ్ లక్ష ఇస్తా అన్న అన్నాడు, అయిపొయింది. అడిగిన టైం కి పంపించాడు, మాకిలాంటి సినీ మానవతావాద ఫ్రెండ్స్ మన దేశం లోను ఇతర దేశాల్లోనూ ఉన్నారు. ఎంత మంచివాళ్ళంటే మాకేదో అప్పున్నట్టు ఇస్తుంటారు మళ్ళీ అడగరు. మేమూ వాళ్ళని disappoint  చేయం, something new & interesting idea ఎదో ఒకటి try చేస్తాం, చేస్తూనే ఉంటాం.

రూమ్స్ బుక్ చేసి, వెహికల్స్ కి డీజిల్, తినటానికి తాగటానికి డబ్బులు ఉంచుకుని, హైదరాబాద్ లో వన్ డే షూట్ ఉంటె అది చేసుకుని నెక్స్ట్ డే చలో హంపి.

Indie Birds

A Still From Montage Song

 

రోడ్ ట్రిప్ మొదలైంది, షూట్ చేసుకుంటూ వెళ్లి విరుపాపరగడ్డికి reach  అయి next day నుంచి shoot continue చేసాం. పగలు shooting రాత్రికి begging జనాల్ని డబ్బుల కోసం. అలా ఏడు రోజులు ఎనిమిది మంది cast & crew తో  షూట్ ముగించాం. Content ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడే చెప్పలేను కానీ, ఒక తెలుగు సినిమాలో ఇటువంటి visuals మాత్రం చూసి ఉండరు. ఇది ఎలాంటి ఫిలిం ? road travel holiday fiction అనొచ్చేమో.

 

1,60,000/- అయింది, డబ్బుల్లేక రెండు రోజులు సగం మంది ఇరుక్కుపోయాం, bags సర్దుకుని restaurant లో కూర్చుని మళ్ళీ begging, ఎవరో ఒకరు ఇస్తారు అని నమ్మకం,  200/- నుంచి 25000/- దాకా వచ్చాయి, బయటపడ్డాం. ఇప్పుడు post production మొదలైంది. 50 రోజుల్లో premier చేయాలన్నది ప్లాన్,మేము చేసినవాటిల్లో fastest అవుతుంది. పనిచేసిన వాళ్ళు ఎవరూ డబ్బులు తీసుకోలేదు, equipment వాళ్లకి కూడా ఇంకా ఇవ్వలేదు. అందరికీ ఎంతో కొంత  ఇవ్వాలి and city లో రెండు రోజులు shoot చేయాలి, postproduction కి డబ్బులు కావాలి, అంతా కలిపి 10,00,000/- ఉంటె ఒక ఫిలిం రెడీ అవుతుంది.

 

మీరు గాని మీకు తెల్సిన సినీ ఉత్సాహవంతులు ఎవరన్నా మాకు support చేయాలనుకుంటే ఈ కింద లింక్ క్లిక్ చేసి డొనేట్ చేయొచ్చు.

Bank Transfer :

ICICI BANK

Cam ran films Private Limited
000805501597
Ifsc : ICIC0000008

UPI : montagesong@icici

%d bloggers like this: