Sanjay Das – Sound Design

ఈ మిక్స్ వినండి, ఏంటి అంత గొప్ప మిక్సా ? కాదు చాలా మంచి మిక్స్. నేను GH5 కెమెరాకి ఉన్న మైక్ నే వాడుకుంటూ షూట్ చేసికొచ్చిన సౌండ్ కి వివేక్ సాగర్ మ్యూజిక్ వేసి దానితో పాటు నా వాయిస్ ఓవర్ కలిసిన మిక్స్. మిక్స్ చేసింది సంజయ్ దాస్.  Its a simple mix, ఏ ఫిలిం కైనా ఇంతకన్నా ఏముంటాయి? Image ambience sound music & dialog. ఇవి సరిగ్గా achieve చేయగలిగితే చాలు, డీసెంట్ సినిమా బయటకొస్తుంది. యువ filmmakers “ఫిలిం కర్నా హై తో సౌండ్ సీఖో” సంజయ్ డ్రమ్మర్, సౌండ్ ఇంజనీర్ కూడా & సౌండ్ designer కూడా. తనొకసారి ఒక మాట అన్నాడు, ఎప్పుడూ అంటుంటాడేమో కూడా అర్రే edit  కి dubbing కి color correction కి vfx కి ఇచ్చినంత టైం మాక్కూడా ఇయ్యండి భై” కడుపు మండే మాట కూడా నవ్వుతూ సాఫ్ట్ గా చెప్పాడు. 

అసలిక్కడ ఎవడూ సౌండ్ కి టైం ఇవ్వడు, 18 ఏళ్లగా చూస్తున్నా లాస్ట్ మినిట్ లో ఇంకా రిలీజ్ పది పదిహేను రోజుల్లో ఉందనగా అర్జెంటు గా చేసేయండి అని 5.1 మిక్స్ కి ఇస్తారు, ఈ మాట అన్నది నేను కాదు, మిక్సింగ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు లేరు చనిపోయారు, నాకు మంచి ఫ్రెండ్. నాకే కాదు ఇండస్ట్రీలో చాలా మందికి మంచి ఫ్రెండ్ ఆయన, కలిసినప్పుడల్లా ఒకటే మాట సౌండ్ పట్టించుకోండయ్యా, టైం ఇయ్యండయ్యా మాకు అని. అసలు అలా పీకల మీదకి తీసుకొచ్చి సౌండ్ ఇంజనీర్స్ మీద ఎంత స్ట్రెస్ తీసుకొస్తున్నారో ఇక్కడెవడికి పట్టదు. హిట్టు కొట్టి రెండు కోట్లు ఎప్పుడు మింగేద్దామా అనే ఆలోచన తప్ప. 

 

Tape Loop
Tape Loop Studio's

సంజయ్ పరిచయం 7-8 ఏళ్ళు అనుకుంటా, రోహిత్ ద్వారా నా జీవితంలో జరిగిన అద్భుతాల్లో టేప్ లూప్ స్టూడియో తో పరిచయం. చిక్కడపల్లి సందుల్లో చిన్న ఇంట్లో ఒక బ్యూటిఫుల్ స్టూడియో. పరిచయం అయిన కొత్తల్లో ఎంత మాట్లాడుకుంటామో నేనూ సంజయ్ ఇప్పటికీ అంతే, may be ఒక పది పదాలు ఎక్కువుంటాయేమో, మంచి సౌండ్ ఇంజనీర్, తక్కువ &  లో వాయిస్లో మాట్లాడతాడు. 

శీష్ మహల్ సింక్ సౌండ్ అన్నపుడు నాకు భయం వేసింది, అప్పటిదాకా నేనేం తీసింది లేదు పీకింది లేదు, ఫస్ట్ ఫిల్మే సింక్ సౌండ్ అంటే బట్టలు వణికాయి. నీకెందుకు నేను చూసుకుంటా అని రోహిత్ ఆ భాద్యత తీసుకుని సంజయ్ & వరుణ్  తో మాట్లాడి సెట్ చేసాడు. మొదటి రోజు షూట్ లలితకళాతోరణం లో వేల మంది జనాల మధ్య, అక్కడ సంజయ్ & వరుణ్ సింక్ సౌండ్ చేస్తున్నారు, డైలాగ్స్ ఉన్నాయి,వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. అప్పుడప్పుడు వినిపిస్తుంటే విన్న ప్రతిసారి surprise  అయ్యా వావ్ ఇంత బాగా చేయొచ్చా సౌండ్ అని, మరి ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్న నాకు తెలియలేదు, ఎందుకంటే నేనొక వెనకబడిన ఇండస్ట్రీలో ఉన్నా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పూర్తిగా సింక్ లో చేయలేకపోయాము, ఐదు రోజులు మాత్రమే చేసాం, but it was a good experience. నాకు exciting thing శీష్ మహల్ లో సంజయ్ acting as sound guy, మీరెప్పుడైనా అటువంటి పాత్ర చూసారా? లేదు. 

 

Sanjay Das
Sanjay Das With Vivek Sagar, Francis Sajja, Thiru Bandhela, Varun Venugopal and Phani Kompella.

సంజయ్ ఒక ఫెస్టివల్లో భాగంగా సౌండ్ సెమినార్ ఒకటి చేసాడు, నేనూ కూర్చుని విన్నా, ఎంత బాగా explain చేస్తున్నాడు అంటే, ఎలాంటి ప్రశ్నకైనా చాలా ఓపికగా సమాధానం చెప్తున్నాడు. సౌండ్ ఇంజనీర్ కి ఎంత ఓపిక కావాలో తెలుసా? సౌండ్ గురించి నాతో మాట్లాడటానికి ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేసి రండి అని తన ఫోన్ నెంబర్ వచ్చిన వాళ్లందరికీ ఇచ్చాడు. తెలుగు సినిమా సౌండ్ బెటర్ అవ్వాలన్నదే అతని తాపత్రయం. 

మనమేదో చింపేసాం చేటని చెరిగేసాం అనుకునే సినిమాని అతను ఎన్నిసార్లు ఎంత ఓపికగా చూడాలో మీ ఆలోచనలకి కూడా అందదు. ఇలా రాసుకుంటూ పోతే పది పేజీలు అవుతుంది.  సంజయ చెప్పినట్టు సౌండ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మనమేం మూకీ సినిమాలు చేయటం లేదు. 

ఒకటి చెప్పి ముగిస్తా, వివేక్ వాళ్ళు live లో perform చేయటం చూసింది పెళ్లి చూపులు ఆడియో ఫంక్షన్ లో, సంజయ్ దాస్ డ్రమ్స్ వాయిస్తుంటే నాకు డౌట్ వచ్చింది, వాయిస్తున్నాడా కిందేమన్నా స్పీకర్స్ పెట్టాడా అని, నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ సంజయ్ వాయింపుడు గురించి ఎంత వాయించినా తక్కువే.

SAMBHRAMA

SAMBHRAMA Celebration of Life

A one blossoms story of four friends and towards their intent goals.set over of 13 years,from

4,300.00 Raised 0.11%
4,000,000.00 Goal
0 Days to Go
Banglore, India
A Love Letter to Camp

A Love Letter To CAMP by Rohit & Sasi

Synopsis : 42 Year old Sasi is a corporate & Ad film maker, lives in

32,500.00 Raised 1.81%
1,800,000.00 Goal
0 Days to Go
Hyderabad, India
Film Montage Song

Film Montage Song

An editor, his girlfriend, a traveller blogger and strangers, more strangers and a lot more

5,000.00 Raised 0.50%
1,000,000.00 Goal
0 Days to Go
Hyderabad, India

Write a comment