Where Is the Friend’s Home ?

Where Is the Friend’s Home
Khane-ye Doust Kodjast ( Iranian title, 1987)
“పొరపాటున ఒక ఫ్రెండ్ workbook తన bag లో పెట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు అహ్మద్, ఫ్రెండ్ పేరు మహమ్మద్ రెజా. ఆ రోజు పొద్దునే స్కూల్లో టీచర్ వార్నింగ్ ఇస్తాడు రెజా కి, రెగ్యులర్ గా హోమ్ వర్క్ చేయటం లేదని రేపు కూడా చేయకుండా వస్తే స్కూల్లోంచి తీసేస్తాము అని. అది గుర్తొచ్చి అహ్మద్ కి టెన్షన్ మొదలవుతుంది, ఇప్పుడేం చేయాలి? రెజా ది పక్క ఊరు, ఒక చిన్న కొండ దాటి వెళ్ళాలి. ఇంట్లోంచి అమ్మ బయటకి పంపడం లేదు, వాడికి workbook ఇవ్వకపోతే homework చేయలేడు , స్కూల్లోంచి తీసేస్తారు. అటువంటి టైం లో అమ్మ పిలిచి బయటకి వెళ్లి బ్రెడ్ కొనుక్కురమ్మని చెప్తుంది, ఇంతకన్నా అవకాశం రాదు అనుకుని, workbook తీసుకుని రెజా ఊరికి బయలుదేరతాడు, ఆ ఊరి పేరు పోష్తే. “
చివరకి పుస్తకం ఇచ్చాడా లేదా? ఇదే ఈ సినిమా కథ.
Hyderabad Film Club 25 సంవత్సరాలు పూర్తయినపుడు ఒక ఫిలిం ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసారు, ఏ సంవత్సరం లోనో గుర్తు లేదు. ప్రపంచ సినిమా అనేది ఒకటుంటుందని తెల్సింది అప్పుడే నాకు. చాలా భాషల సినిమాలు చూసాను. కానీ Where Is the Friend’s Home చూసి ఇంటికి వెళ్లేంత వరకు దాని గురించే ఆలోచన, ఇంటికి వెళ్ళాక కూడా. ఒక ఎనిమిదేళ్ల అబ్బాయి తన ఫ్రెండ్ workbook ఇవ్వడానికి వెళ్ళటం, మరీ ఇంత చిన్న కథ సినిమా తియ్యొచ్చా? అది కూడా ఆ అబ్బాయికి తన ఫ్రెండ్ ఇల్లు తెలియదు, పూర్తి పేరు తెలియదు,ఊర్లో తిరుగుతూ కనిపించిన వాళ్ళని అడుగుతుంటాడు. ఎంత suspense ఉంటుందంటే , ఇస్తాడా ఇవ్వడా ? వాణ్ణేమో ఊర్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు.
Workbook పట్టుకుని అహ్మద్ ఒక చిన్న కొండ దాటే షాట్ చూసి stun అయిపోయా. తన ఫ్రెండ్ కోసం వెతికే క్రమంలో కొంతమందిని కలవటం , వాళ్ళతో అహ్మద్ కబుర్లు , చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఇరాన్ గ్రామీణ జీవన విధానం అర్ధమవుతూ ఉంటుంది మనకి. మనుషులు అర్ధమవుతుంటారు,
దీని దర్శకుడు Abbas Kiarostami , ఆయన గురించి నేను రాయటం కన్నా online వెతుక్కుంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఈ సినిమా చూసిన దగ్గరనుంచి ఇరానియన్ సినిమా మీద అభిమానం గౌరవం పెరిగిపోయాయి. తర్వాత ఇంకొన్ని సినిమాలు చూసాను. ఎక్కువ పిల్లల చుట్టూ తిరిగే సినిమాలే. కానీ అవి “పిల్లల సినిమాలు” కాదు. అందరూ చూడతగ్గవి చూడాల్సినవి. పైగా ఆ పిల్లల acting చూస్తే దిమ్మతిరిగిపోతుంది, ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నారు ? మన సినిమాల్లో పిల్లల అత్యంత అతి acting అప్పటికే చాలా చూసిన నాకు iran పిల్లల నటన అద్భుతం అనిపించింది.
ఈ సినిమా గురించి రాద్దామనుకుని, చాలా రోజులైంది కదా చూసి ఇంకొంచెం information కోసం online వెతుకుతుంటే ఈ ఆర్టికల్ దొరికింది, ఇది చదవండి చాలు
http://www.filmsufi.com/2012/05/where-is-friends-home-abbas-kiarostami.html
Source : Camp Sasi.
Start Your Dream Project now At : Indie Birds